23-07-2025 12:32:33 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జులై 22 (విజయక్రాంతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మంగళవారం నాడు వలిగొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయ పాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
సమయ పాలన పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ ని శుభ్రంగా ఉంచుకోవాలని. ఓపి ని తనిఖీ చేశారు.ఆసుపత్రి కి వచ్చిన రోగులను వివిధ పరీక్షల నిమిత్తం ప్రవేట్ ల్యాబ్ లకు పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆసుపత్రి రికార్డులను ఫార్మసీ రూములు పరిశీలించారు, అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు తగిన విధంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.