calender_icon.png 17 November, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం పకడ్బందీగా చట్టాలు అమలు

17-11-2025 08:28:27 PM

లీగల్ సెల్ ప్యానల్ లాయర్ బి.డేవిడ్..

చిట్యాల (విజయక్రాంతి): వృద్ధులు, వికలాంగుల కోసం చట్టాలు పకడ్బందీగా అమలు జరుగుతున్నాయని సోమవారం లీగల్ సర్వీసెస్ ప్యానల్ లాయర్ బి.డేవిడ్ అన్నారు. మండలంలోని కక్కిరేణి గ్రామ పంచాయితీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఉమ శంకర్ సమక్షంలో పేరెంట్స్, సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007 ఉద్దేశించి లీగల్ సెల్ ప్యానల్ లాయర్ బి.డేవిడ్, సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలంలు కలిసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం నందు ప్రజలకి వృద్దులు, వికలాంగుల చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు పిల్లలు, బాలబాలికలు కార్మిక చట్టాలు, పొక్సో చట్టం, బాల్య వివాహాలు, గృహ హింసా చట్టం, మహిళల రక్షణ, సంరక్షణ వంటి అనేక చట్టాలు ఉన్నాయని ప్రతి వ్యక్తి అన్ని చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న లీగల్ సర్వీసెస్ సేవలు వినియోగించుకావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వేముల సైదులు, గ్రామస్తులు పిట్ట సోమిరెడ్డి, సోమనబోయిన ఆదినారాయణ, సోమేశ్వర రావు, చింతం శ్రీనివాస్, కొంపల్లి అనిత, వంశీ, నర్సింహ, కిషన్ అంజయ్య, కవిత, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.