calender_icon.png 17 November, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు

17-11-2025 08:58:44 PM

మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి..

మెదక్ టౌన్: మెదక్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు పైన ఒక వ్యక్తి పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలసి సోమవారం మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తప్పుడు కేసు నమోదు చేయడం విషయంలో పూర్తి విచారణ జరిపి కేసు కొట్టివేయాలని కోరారు. సంఘటననే జరగనప్పుడు  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారని డిఎస్పిని ప్రశ్నించారు.

అదేవిధంగా అధికార పార్టీ నేతలు ఇలాంటి కేసులు పెట్టుకుంటూ పోతే ఉపేక్షించేది లేదని, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థ పై గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి, కానీ ఆ గౌరవాన్ని తగ్గించే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తకు, నాయకులకు అందరికీ అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేస్తామనడం, బెదిరింపులకు గురి చేయడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. లేనియెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ మెదక్ అభివృద్ధిపై పెట్టాలని విమర్శించారు.