17-11-2025 08:21:21 PM
తాండూరు (విజయక్రాంతి): జాతీయస్థాయిలో డిసెంబర్ నెలలో జరిగే క్రీడా పోటీలకు వికారాబాద్ జిల్లా యాలాల జడ్పిహెచ్ఎస్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్టు ప్రధాన ఉపాధ్యాయులు సిద్రామేశ్వర్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో డిస్కస్ త్రో విభాగం మొదటి స్థానంలో నిలిచిన 9వ తరగతి విద్యార్థి వి.శివ కుమార్ జాతీయస్థాయి పోటీకి ఎంపిక కాగా 3000 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానంలో నిలిచిన పదవ తరగతి విద్యార్థి సాయికిరణ్ జాతీయస్థాయి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో జరిగే స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిద్ధిరామేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అభినందిస్తూ అన్నారు. విద్యార్థులను జాతీయస్థాయిలో పోటీ పడేందుకు మెలకువలు నేర్పిన పిడి రాజశేఖర్ ను, ఉపాధ్యాయ బృందానికి విద్యార్థుల తల్లిదండ్రులు వెంకటయ్య, గోరియా నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.