17-11-2025 08:47:43 PM
ముకరంపుర (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ కారుల జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా సమావేశం నగరంలో జిల్లా అధ్యక్షులు బండ గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలోని పలు డివిజన్ లకు కన్వీనర్, కో కన్వీనర్లను నియమించారు. ఒకటవ డివిజన్ కన్వీనర్ గా సింగతి పవన్ కుమార్, కో కన్వీనర్లుగా కిషన్ ప్రసాద్, లత, అశోక్ రాజు, ఎన్. సంపత్, 17వ డివిజన్ కన్వీనర్ గా బండారి రఘు, కోకోనర్లుగా బి. తరుణ్ తేజ, కట్ల మహేందర్, గణేష్, కే. అశోక్, 18వ డివిజన్ కన్వీనర్ గా కాంతాల మల్లారెడ్డి, కోకన్వీనర్లుగా దూస లక్ష్మి నారాయణ, సూర్ల రాజు, బండారి లక్ష్మణ్, 45వ డివిజన్ కన్వీనర్ గా సంగెమ్ వీర బ్రహ్మం, కోకోనర్లుగా ఓంప్రసాద్, తుమ్మ శ్రీనివాస్, జావీద్, అజీమ్, 13వ డివిజన్ కన్వీనర్ గా రామగిరి దామోదర్, కోకన్వీనర్లుగా బి. మల్లేశం, గౌరయ్య, శ్రీనివాస్ లను, 11వ డివిజన్ కన్వీనర్ గా సరోజన, కోకన్వీనర్లుగా శ్రీనివాస రావు, బి. శ్రీనివాస్ గౌడ్ లను నియమించారు.
ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు బొత్తా వెంకట మల్లయ్య, ప్రధాన కార్యదర్శి దుర్గ మారుతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని సత్యనారాయణ గౌడ్, మహిళా అధ్యక్షురాలు కవిత, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, వీరబ్రహ్మం, బండారి రఘు తరుణ్, సరోజన, పవన్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.