calender_icon.png 17 November, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆలయంలో ప్రథమ మండల పూజ

17-11-2025 09:36:51 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం ప్రథమ మండల పూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, ధ్వజారోహణం కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, సాయంత్రం పెద్దఎత్తున మహా పడిపూజ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కుటుంబరావు, అయ్యప్ప గురు స్వాములు కోడి రమేష్, రాయ మల్లు, మంగమూర్తి, శ్రీకాంత్ స్వాములు పాల్గొన్నారు.