calender_icon.png 17 November, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్టాండ్ కు అడ్డుగా ఉన్న తోపుడు బండ్ల తొలగింపు

17-11-2025 08:51:11 PM

కొండపాక: సిద్దిపేట నుంచి హైదరాబాద్ రాజీవ్ రహదారిపై కొమురవెల్లి కమాన్ వద్దగల బస్టాండ్ కనిపించకుండా చిరు వ్యాపారులు తోపుడుబండ్లు అడ్డు పెట్టుకొని వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. తోపుడు బండ్లు అడ్డుగా ఉంచి వ్యాపారం చేస్తున్నందున ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నయని ఇటీవల సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. అందులో భాగంగానే సిపి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం తొగుట సిఐ లతీఫ్ కుకునూరుపల్లి ఎస్ ఐ శ్రీనివాసు లు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఈ చిరు వ్యాపారులతో మాట్లాడి అక్కడి నుంచి బండ్లను తొలగించి వేశారు. బస్టాండ్ ముందు డోజర్ సహాయంతో చదును చేశారు. స్థానిక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.