3 April, 2026 | 4:11 AM

మర్లపాడు మట్టి మాఫియా..

03-04-2026 01:37 AM

పట్టించుకోని ప్రభుత్వ అధికారులు

వేంసూరు ఏప్రిల్ 2 (విజయక్రాంతి): వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో విచ్చలవిడిగా మట్టి మాఫియా తవ్వకాలు జరుగుతున్నాయి.  గత నాలుగు రోజుల క్రితం సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీ పక్కన మట్టి మాఫియా తవ్విన గుంటలు వాటర్ నిల్చిపోవడం వల్ల చదువుకునే పసిగందులు సరదాగా ఈతకి వెళ్లి లోతు తెలియక చనిపోయారు.

ఇంత జరిగినప్పటికీ మట్టి తవ్వకాలు ఆగడం లేదు. రెవిన్యూ శాఖ,  పోలీస్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండదండలుగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అక్రమ మట్టి తవ్వకాల పైన సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  రెచ్చిపోతున్న మట్టి దందా,  ట్రాక్టర్లను చూసి ప్రజలు  భయాందోళనతో భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు అక్రమ మట్టి వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.