బలమైన ఆర్థిక ఫలితాలు నమోదు
ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ఘనత
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ సమగ్ర ఆరోగ్య సేవల సంస్థ ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ 20 26--27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లో (ఏప్రిల్--జూన్) బలమైన ఆర్థిక ఫలితా లు నమోదు చేసింది. కంపెనీ సంయుక్త ప్రో ఫార్మా ఆదాయం గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.2,597 కోట్లకు చేరగా, ఆపరేటింగ్ ఈబిట్డా 30 శాతం పెరిగి రూ. 576 కోట్లకు చేరింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆస్టర్ డీఎం హెల్త్కేర్‌క్వాలిటీ కేర్ విలీనంతో సంస్థ దేశంలోని అతిపెద్ద ఆస్పత్రుల నెట్వర్క్లలో ఒకటిగా అవతరించింది.
ప్రస్తు తం 28 నగరాల్లో 10,800కు పైగా పడకలతో సేవలందిస్తుండగా, భవిష్యత్తులో 15 వేలకుపైగా పడకలకు విస్తరించాలనే ల క్ష్యా న్ని సంస్థ ప్రకటించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ అజాద్ మూఫెన్ మాట్లాడుతూ విలీనం సంస్థ అభివృద్ధిలో కీలక మై లురాయిగా నిలుస్తుందన్నారు. ఎండీ, గ్రూ ప్ సీఈఓ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ తొ లి త్రైమాసికంలో దాదాపు 20 లక్షల మంది రోగులకు వైద్య సేవలందిచామన్నారు.






