7 August, 2026 | 2:31 AM

సింధు హాస్పిటల్స్‌లో అత్యాధునికి చికిత్స

07-08-2026 12:00 AM

హైపర్థర్మిక్ ఇంట్రాతోరాసిక్ కెమోథెరపీ 

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): సింధు హాస్పిటల్స్‌లో తొలిసారిగా హైపర్థర్మి క్ ఇంట్రాతోరాసిక్ కెమోథెరపీ విధానంతో అత్యాధునిక శస్త్రచికిత్స నిర్వహించి, అరుదైన స్టేజ్ ఐవీఏ టైప్- థైమోమాతో బాధపడుతున్న 35 ఏళ్ల రోగికి విజయవంతంగా చికి త్స అందించారు.

డా. కె.వి.వి.ఎన్. రాజు ఆ ధ్వర్యంలోని సర్జికల్ ఆంకాలజీ విభాగం వై ద్యులు డా. మధు నారాయణ, డా. ఫైసల్, అనస్థీషియా విభాగం డా.వేణుగోపాల్ నే తృత్వంలో డా.శ్యామ్, డా.సురేష్ బాబు, డా. ఆర్.వి. రావు ఆధ్వర్యంలోని మెడికల్ ఆంకాలజీ విభాగం వైద్యులు డా. అరుణ్, డా. సౌ మిక సమిష్టి కృషితో ఈ క్లిష్టమైన చికిత్సను చేశారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని స్థి రమైన ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు.

ఎంపిక చేసిన సే ్టజ్ ఐవీఏ థైమోమా రోగుల్లో హైపర్థర్మిక్ ఇం ట్రాతోరాసిక్ కెమోథెరపీ దీర్ఘకాలిక వ్యాధి నియంత్రణకు ఉపయోగపడుతుందన్నారు. సింధు హాస్పిటల్స్ చైర్మన్ డా. బండి పార్థసారథి రెడ్డి ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వ హించిన వైద్య బృందాన్ని అభినందించారు.