ఈతకు వెళ్లిన విద్యార్థి మృతి
02-12-2024 12:00 AM
హాస్టల్ ట్యూటర్ పొలం వద్ద ఘటన
అనంతగిరి, డిసెంబర్ 1: బావి లో ఈత కోసం దిగిన హాస్టల్ వి ద్యార్థి మృతి చెంది న ఘటన సూర్యాపేట జిల్లా అనంత గిరి మండలంలోని శాంతినగర్ గ్రామంలో చోటుచేసుకుంది. చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన గుగులోతు తిరుమలేశ్(15) శాంతినగర్ గ్రామంలోని సమీకృత వసతి గృహంలో పదో తరగతి చదువుతున్నాడు.
ఇదే హాస్టల్‌లో ట్యూటర్‌గా పనిచేస్తున్న వీరబాబు.. ఆదివారం విద్యార్థులు తరుణ్, తిరుమలేశ్‌లను తన వెంట శాంతినగర్ శివారులోని తమ పొలం వద్దకు తీ సుకెళ్లాడు. అక్కడ ఈత కొట్టేందుకు వీరబాబు బావిలోకి దిగగా తిరుమలేశ్ కూడా బావిలోకి దూకాడు. ఈ తరాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. ట్యూటర్ వీరబాబు పరారీలో ఉన్నాడు.




