06-11-2025 12:00:00 AM
భీమదేవరపల్లి నవంబర్ 5 (విజయక్రాంతి); జాతీయ సేవా పథకం ప్రత్యేక శీతకాల శిబిరంలో భాగంగా శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం చుట్టు ప్రాంతంలో ఏ కే వి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులు శ్రమదానం చేశారు.
చంటయ్యాపల్లి గ్రామం దారిలో కొమ్మలు కొట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నారు. ముస్తఫాపూర్ గ్రామం లో రహదారి శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో ఏ కేవీఆర్ కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఓదెలు, భారతి అధ్యాపకులు పాల్గొన్నారు.