06-11-2025 12:00:00 AM
మంత్రి వెంటనే నిధులు కేటాయించాలి
భీమదేవరపల్లి నవంబర్ 5 (విజయక్రాంతి); మొంథా తుఫాను ప్రభావంతో దేవాదుల నార్త్ కెనాల్ తీవ్రంగా కోతకు గురి అయిం ది. అనేకచోట్ల పెద్ద ఎత్తున గండ్లు పడి కెనాల్ కు అపార నష్టం వాటిల్లింది. కెనాల్ పొడువునా పూటిక చేరింది. కెనాల్ తూము డి6 ఉండి డి7 మధ్యలో కొత్తపల్లి గ్రామ శివారులోని కొచ్చేరువు వద్ద ఇనుప రాతి గుట్టల నుండి వచ్చే వరద కోత వల్ల మరియు మంచిల్ల బండ పైనుంచి వచ్చే వరద ఎక్కువ రావడం వలన దేవాదుల నార్త్ కెనాల్ కు పెద్ద ఎత్తున పలుచోట్ల గండ్లు ఏర్పడ్డాయి.
కెనాల్ లోపల చేరిన ఇసుక మేట సూపర్ పాసేజ్ బాటమ్ లెవెల్ వరకు పేరుకుపోవడంతో మరోపక్క కెనాల్ లో నిండుగా వరద నీరు నిలిచిపో యింది.కెనాల్ గండి పడ్డ చోట వెంటనే మంత్రి సర్వే చేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, తక్షణ మరమ్మతు కోసం నిధులు విడుదల చేయాలని మండల రైతాంగం విజ్ఞప్తి చేసింది .