calender_icon.png 6 November, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు క్రీడాదుస్తుల పంపిణీ

06-11-2025 12:00:00 AM

కాకతీయ యూనివర్సిటీ,5 నవంబర్ ( విజయ క్రాంతి ); వరంగల్ నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రంగశాయిపేట క్రీడా మైదానంలో బుధవారం రంగశాయిపేట టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా దుస్తువుల పంపిణీ చేశారు.నవంబర్ మాసంలో పెద్దపల్లి జిల్లా లో జరగబోయే 58వ రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీల లో పాల్గొనబోయే ఉమ్మడి వరం గల్ జిల్లా క్రీడాకారిణిలకు క్రీడా దుస్తువులను అందజేశారు.

అనంతరం సంఘ అధ్యక్షులు దామెరకొండ సదానందం మాట్లాడుతూ విద్యార్థినులు చదువే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని మన భారత మహిళామణులు క్రికెట్ లో ప్రపంచకప్ సాధించి మహిళలలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు అని నిరూపించారన్నారు.

ఆ స్పూర్తి తో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలనీ ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు జక్కం దామోదర్, బొలిశెట్టి కమలాకర్, ఆరేళ్లి శ్రీనివాస్, చిమ్మని పెద్దిరాజు, వల్లాజి నర్సింహ స్వామి, బండ గౌరీశంకర్, పాక శ్రీనివాస్, మానుపాటి వెంకటేశ్వర్లు, నారాయణ పాల్గొన్నారు.