calender_icon.png 25 November, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గమ్యం చేరాలంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి

11-02-2025 12:09:09 AM

పీఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు 

యాచారం ఫిబ్రవరి 10: సోమవారం యాచారం మండలంలోని గున్ గల్ ఆదర్శ పాఠశాలలో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగా రావు పాల్గొని మాట్లాడుతూ.

గత నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినట్టు జ్ఞానం పెంపొందించాలని లక్ష్యంతో మెటీరియల్ లాస్ట్ మినిట్ రివిజన్ బుక్ అందించడం జరుగుతుంది.  ఈ మెటీరియల్ రాష్ట్రస్థాయి విషయ నిపుణులచే విద్యార్థులకు సులభమైన పద్ధతిలో అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ పేపర్ గా మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు.

ఎలాంటి ఆర్థిక పరమైన వనరులు ఫౌండేషన్ కు లేకున్నా ఒక ఆశయంతో విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని విద్యార్థులు చెడను వదిలి మంచి లక్షణాలను అలవర్చుకునేలా చైతన్యవంతం చేయడమే పి ఆర్ ఆర్ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు.

దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలలో ఇప్పటివరకు 200 మంది విద్యార్థులకు లాస్ట్ మినిట్ రివిజన్ బుక్ అందించడం జరిగిందని ప్రస్తుతం ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బైలాజికల్ సైన్స్ ఇవ్వడం జరుగుతుందని భవిష్యత్తులో మిగతా సబ్జెక్టులతో మెటీరియల్ రూపొందించి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలను చూసి విద్యార్థుల అభ్యున్నతికి మా వంతుగా కృషి చేస్తామని ప్రోత్సాహం అందిస్తున్న అందరి సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యార్థులు ఈ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.

విద్యార్థులు పెట్టుకున్న లక్ష్యం కోసం ఇష్టంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులు ఇచ్చినటువంటి ఫలితాలే ఫౌండేషన్కు ప్రోత్సమని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్   అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఫౌండేషన్ మెంబర్  ఆకుతోట నరసింహ  పాల్గొన్నారు.