11-02-2025 12:07:57 AM
వనపర్తి, ఫిబ్రవరి 10 ( విజయక్రాంతి ): ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో అంబులెన్సులోనే ప్రసంవించిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే మండలంలోని గోవర్ధన గిరి గ్రా మానికి చెందిన నస్రిన్ బేగానికి పురోటి నొప్పులు రావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు.
అక్కడినుండి మెరుగైన వైద్య చికిత్స కోసం వనపర్తి జిల్లా ఎంసీహె ఆసుపత్రి కి రెఫెరల్ చేయడంతో 108 అం బులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడం తో టెక్నీషియన్ నరేందర్, పైలెట్ రవి, ఆశా వర్కర్ పార్వతి ఆమెకు ప్రసవం చేశారు. నస్రీన్ బేగంకు పండంటి ఆడబిడ్డకు జన్మని చ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.