11-02-2025 12:10:28 AM
కిచెన్‌లో బొద్దింకలు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 10: కొన్ని హోటళ్లలో పరిస్థితులు అద్వానంగా ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ విష యాలు వెల్లడయ్యాయి. రాజేంద్ర నగర్ లోని ది ఫోర్ట్, డెలిష్ బై హోమ్స్ కిచెన్ రెస్టారెంట్ లలో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికా రులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన కూరగాయలు వాడు తున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని వెల్లడించారు.
కిచెన్‌లో బొద్దింకలు తిరుగుతున్నా యన్న అధికారులు.. ఆయా హోటల్లలో యాజమాన్యాలు గడువు ముగిసిన ఫుడ్ ఇన్గ్రీడియంట్స్ వాడు తున్నట్లు గుర్తించారు. ఈమేరకు అధికారులు రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు ఇచారు. పరిస్థితులు మారకపోతే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు..