05-12-2025 06:17:47 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్లోని రిసెప్షనిస్ట్ ఎం. రోజారాణి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని వివరించారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించారు. తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కానిస్టేబుల్ స్టేషన్ రైటర్ కే రవీందర్ విద్యార్థులకు స్టేషన్లోని గదులను, లాకప్ గదిని చూపించారు. సైబర్ నేరాలు,ఫోన్లలో గేమ్స్ పై అవగాహన కల్పించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థుల వెంట పాఠశాల ప్రధానాచార్యులు భాగ్యలక్ష్మి ఉన్నారు.