calender_icon.png 5 December, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటెక్ విద్యార్థి బలవన్మరణం

05-12-2025 06:48:45 PM

హుజూరాబాద్,(విజయక్రాంతి): ఉరేసుకుని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కొక్కొండ రమేష్-రజిత దంపతుల పెద్ద కుమారుడు అభిలాష్ (19) శుక్రవారం తన ఇంట్లో బాత్రూంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అభిలాష్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడు సింగాపుర్ గ్రామంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అభిలాష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.