05-12-2025 06:38:59 PM
మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అనుమాండ్ల జగదీష్
కుమ్రంభీం అసిఫాబాద్/తిర్యాణి,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేల కార్యకర్తలు ప్రత్యేక కృషి చేయాలని ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమాండ్ల జగదీష్ పిలుపునిచ్చారు. మండలంలోని కుంటగూడ, తోయరేటి, బందర్ ఘాట్ గ్రామాలకు నుంచి సుమారు 60 మందికి పైగా ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు గులాబి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలా ప్రజల్లో రేవంత్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
రైతులు సాధారణ ప్రజల మద్దతు బీఆర్ఎస్ వైపే ఉందన్నారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు భద్ర ఆదుకుంటూ, అవసరానికి సహాయపడుతూ ప్రతీ ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవడమే అధినేత కేసీఆర్ సంకల్పమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఎండగ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.