05-12-2025 06:24:26 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఈ వి ఎం గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి సి కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.