05-12-2025 06:13:49 PM
నకిరేకల్,(విజయక్రాంతి): శాలిగౌరారం మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరగడానికి సర్పంచ్ అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు పాటించాలని శాలిగౌరారం తహసిల్దార్ బిట్ల వరప్రసాద్ అన్నారు. శుక్రవారం తహసీల్దార్ వరప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులందరూ ప్రచారానికి సంబంధించిన వాహనాలు లౌడ్ స్పీకర్లు,ఊరేగింపులు, సమావేశాలకు కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.లేనిచో ఎన్నికల నిబంధన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుందని,కావున తప్పకుండా ముందస్తు అనుమతి తీసుకోవాలని,అనుమతి కోసం సంబంధిత అన్ని ధృవ పత్రాల తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.