calender_icon.png 5 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహారంపై యాప్ ద్వారా పర్యవేక్షణ

05-12-2025 06:30:35 PM

ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో గల 4 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ లలోని గిరిజన పాఠశాలలలు/ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టిక ఆహారంపై ఐటిడిఏ పల్స్ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు కామన్ డైట్ మెనూ సక్రమంగా అమలు చేయడానికి యాప్ ను ప్రారంభించడం చేయడం జరిగిందని, ఈ యాప్ ద్వారా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు/ వసతి గృహ సంక్షేమ అధికారులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఫోటోలు యాప్ లో అప్ లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు యాప్ ను ఉపయోగించి ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారని, ఈ ఫోటోలు, వివరాలను నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.

ఈ యాప్ లో ఏవైనా సమస్యలు ఉన్నచో ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని, ఆహారంలో నాణ్యత, పరిశుభ్రతను నిర్ధారించడానికి ఫోటోలను అప్లోడ్  చేసిన తర్వాత  రోజు వారీగా ప్రాజెక్టు అధికారి పేషి స్వయంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు/ వసతి గృహ సంక్షేమ అధికారులు "ఎ.ఐ." ద్వారా అప్లోడ్ చేసిన ఆహార పదార్థాలను, వాటి నాణ్యతను పర్యవేక్షించడం జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నుండి పూర్తి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.