05-12-2025 06:41:34 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పూజారి వెంకట్ తెలిపారు. మండలంలోని రామచంద్రునిపేట, బోడు, కొప్పురాయి, బర్లగూడెం, తదితర పంచాయతీల్లో శుక్రవారం జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రునిపేట పంచాయతీ బీఆర్ ఎస్ అభ్యర్థి పడిగ సువర్ణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు నాయకులు ఈసాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.