calender_icon.png 5 December, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కార్ అండగా నిలుస్తోంది

05-12-2025 06:34:59 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కార్ ఎంతగానో అండగా నిలుస్తుందని మేడ్చల్ బిజెపి సీనియర్ నాయకురాలు బచ్చు కృష్ణా ప్రియ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇప్పటి వరకు 14,236 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో పెట్టుబడిగా జమ కావడం జరిగిందన్నారు. రైతులపై భారం పడకుండా ఐదు ఏళ్లలో కేంద్రం యూరియా సబ్సిడీ కింద 6.21 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలంగాణ రాష్ట్రం నుండి రికార్డు స్థాయిలో ధాన్యం పత్తి కొనుగోలు చేసిందని కృష్ణ ప్రియ మల్లారెడ్డి వెల్లడించారు.

ఆరోగ్య విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొత్తగా 511 పిజి సీట్లను మంజూరు చేసిందని నకిలీ మందులను అరికట్టేందుకు నాణ్యమైన మందులను 700 కంపెనీలలో కేంద్రం ఆడిట్ చేసిందని కృష్ణప్రియ తెలియజేశారు.సహకార సంఘం కోసం రాష్ట్రంలో 48,186 సంఘాల బలోపేతం మార్కెటింగ్ డైరీ రంగానికి 20,829 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అభివృద్ధి లక్ష్యం సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అండగా నిలిచారని ఆమె కొనియాడారు.