23-07-2025 12:24:26 AM
సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు
కొత్తకోట జులై 22 : సైబర్ నేరాలపై ప్రతి విద్యార్థి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. మంగళవారం కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాలలో రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా సహకారంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ ఫర్ మేషన్ కర్నూల్ స్వచ్చంద సంస్థ సేవ ఆధ్వర్యంలో డిపాజిటర్ ఎడ్యూకేషన్ అండ్ అవర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యతితులుగా సీఐరాంబాబు , ఎస్త్స్ర ఆనంద్ , ఎమ్‌ఈఓ కృష్ణయ్యలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్టంలో బాలికలపై హత్యాచారాలు జ రుగుతున్నాయని వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యార్థులు దైర్యంగా ఉండాలని ఆత్మరక్షణకు కోసం కరా టేలాంటివి నేర్చుకోవాలని సూచించారు. యువకులు అమ్మాయిలను చాలా సింపుల్ గా ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారని గుర్తు చేశారు.
సైబర్ నేరగాళ్ళు అ మ్మాయిలను టార్గెట్ చేసి ఫొటోస్ మార్పింగ్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తారని అలాంటి వారిపట్ల జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పారు. చదువుకోవాల్సిన టైమ్ లో చదువుకోవాలని మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానంలోకి వెళ్లాలని కోరారు. అమ్మాయిలు ఏదైనా సాధిస్తారు అనే దానికి మీరే నిదర్శనం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.