calender_icon.png 23 July, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ఎక్కి దమ్ము చేసి.. నడుం వంచి నాట్లు వేసి

23-07-2025 12:25:06 AM

కూలీలలో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

 మిర్యాలగూడ. జులై 22  (విజయక్రాంతి):  ప్రభుత్వకార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం లో క్షణం తీరిక లేకుండా సమీక్షలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు ఇలా నిత్యం బిజీ గా ఉండే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బీఎల్ ఆర్ మంగళవారం రైతు అవతారం ఎత్తారు. 

మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో రైతులతో కలిసి నారు మడిని ట్రాక్టర్ తో దమ్ము చేసి మహిళా  కూలీలతో నాటు వేసి పలువు రిని ఉత్సాహపరిచి స్వయంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న ఆయన సాగులో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గుండు నరేందర్ గౌడ్. బిక్షం. రామయ్య మురళి. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.