నేటితో ముగియనున్న ముంపు బాధితుల నిరసన దీక్ష
08-12-2024 05:52 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు నుంచి తమ ఇండ్లను కాపాడాలని కోరుతూ చెరువు వద్ద నెల రోజులుగా చేపట్టిన ముంపు బాధితుల నిరసన దీక్ష సోమవారంతో ముగియనుంది. తమ నిరసన దీక్ష సజావుగా జరిగేందుకు అన్ని విధాలుగా సహకరించిన అమీన్ పూర్ పోలీసులకు ముంపు బాధితుల జేఏసీ సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఎస్ఐ సోమేశ్వరిని జేఏసీ చైర్మన్ సీహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో సభ్యులు కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. సోమవారంతో తమ నిరసన దీక్ష పూర్తవుతుందని అదే రోజు జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేస్తామని జేఏసీ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు.






