calender_icon.png 17 July, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ఆదేశాలతో డెస్క్ బెంచీలు ఏర్పాటు

16-07-2025 05:27:00 PM

విద్యార్థుల సంఖ్యకనుగుణంగా తరలింపు

ఆకస్మిక తనిఖీ.. కొద్దిగంటలోనే సమస్య పరిష్కారం

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని మారుపాక లోని ప్రభుత్వ విద్యాలయంలో డెస్క్ బెంచీలు ఏర్పాటు చేశారు. వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని మారుపాక ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డెస్క్ బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా డెస్క్ బెంచీలు వెంటనే సర్దుబాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో వారు విద్యార్థులకు సరిపడా డెస్క్ బెంచీలు తరలించి, విద్యాలయంలో ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసిన కొద్ది గంటలోనే సమస్య పరిష్కారం అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.