19-09-2025 07:32:20 PM
మందమర్రి,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడల ద్వారా శారీరకదారుడ్యo పెంపొందుతుందని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో భాగంగా శుక్రవారం పట్టణం లోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు ఆట పాటల్లోనూ తగిన నైపుణ్యం సాధించాలన్నారు. క్రీడల ద్వారా శరీరానికి తగిన వ్యాయామం చేకూరుతుందని విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా కారులుగా ఎదగాలన్నారు.