19-09-2025 09:10:12 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ దుర్షెడ్ డివిజన్లో బతుకమ్మ ఆడుకునే స్థలాలతో పాటు, ఇరుకుళ్ళ నది వద్ద నిమజ్జనం ఏర్పాట్ల స్థలాలలో శుభ్రపరచి డస్ట్ పోయించి,విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు.
చేసి తగిన సిబ్బందిని సమకూర్చలని, అదే విధంగా దుర్శేడ్ స్మశాన వాటికకు సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. దహన కార్యక్రమనంతరం మహిళలు ఆరుబయట స్నానాలు చేస్తున్నారని, మహిళల కోసం స్నానపు గదులను ఉపయోగంలోకి తిరిగి తీసుకరావల్సిందిగా కోరామన్నారు. దాంతోపాటు డివిజన్ కార్యాలయంలో ఆయా అధికారులకు సంబంధించి మొబైల్ నెంబర్లు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు స్పందించేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ద్వారా తెలియజేశామని తెలిపారు.