19-09-2025 08:31:19 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి 69వ ఎస్డిఎఫ్ కబడ్డీ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కాగా ఈ క్రీడోత్సవాలను పిఆర్టియు మండల అధ్యక్షుడు పసల విజయనంద్ తన సొంత నిధులతో తన తమ్ముడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయానంద తల్లిదండ్రులైన పసల జయతమ్మ- జోసఫ్ లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు.