19-09-2025 09:03:08 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): సాయి గణేష్ భక్తమండలి గోదావరి రోడ్డు ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రుల కరపత్రాలను శుక్రవారం గోదావరి రోడ్డులోని దేవి మండపం ఆవరణలో స్థానిక ఎంఆర్ఓ దిలీప్ కుమార్, ఎస్ ఐ సురేష్ లు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దుర్గాదేవి కమిటీ సభ్యులు మాట్లాడుతూ.... దుర్గామాత ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరు దుర్గా నవరాత్రులలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా కలకత్తా విజయవాడ వారి అలంకరణలతో గోదావరి రోడ్డులో దుర్గాదేవి నవరాత్రులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.