calender_icon.png 19 September, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటు సారా తయారీ, రవాణా, అమ్మిన, కఠిన చర్యలు తీసుకుంటాం

19-09-2025 08:28:07 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నాటు సారా తయారు చేసిన, అమ్మిన, రవాణా చేసిన, కఠిన చర్యలు తప్పవని ఖానాపూర్ ఎక్సైజ్ ఎస్సై వసంతరావు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి, సేవ్యా నాయక్ తండ, ఎల్లాపూర్, కొమ్ముతాండ, బీర్నంది గ్రామాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఒకరిపై కేసు నమోదు చేసి ఆమె వద్ద ఐదు లీటర్ల నాటు సారాయి, 200 లీటర్ల నల్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై వసంతరావు తెలిపారు .వివిధ కేసులలో పట్టుబడిన 13 మందిని ఖానాపూర్ తాసిల్దార్ సుజాత రెడ్డి ముందర బైండోవర్ చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడులలో సిబ్బంది సాయన్న, రాజేందర్, రవీందర్, కల్పన తదితరులు ఉన్నారు.