13-08-2025 12:15:39 AM
ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ ,ఆగస్టు 12: వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలేత్తకుండా చూడాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వార్డెన్లకు సూచించారు.ఈ మేరకు మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన వార్డెన్లు ఎమ్మెల్యే విజయుడు ను మర్యాదపూర్వకంగా క లిశారు.ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో విద్యార్థులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డెన్లు ,తదితరులు పాల్గొన్నారు.