09-01-2026 02:32:13 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్
సంక్రాంతి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి(Agricultural Farm Mechanization Scheme) మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ... లంకా సాగర్, వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలు కేటాయిస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వైరా ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను లంకా సాగర్ వరకు తరలించామని వివరించారు. రాజేంద్రనగర్ కంటే మిన్నుగా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వర్థిల్లాలని తుమ్మల ఆకాంక్షించారు.
వివిధ రకాల పంటలు పండించేందుకు రైతులు ముందుకు వచ్చారని మంత్రి స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లాను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మూడేళ్లలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాకుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాలకు సంక్రాంతి(Sankranthi) నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం అములుకు ప్రణాళికలు రచించామని మంత్రి తుమ్మల వెల్లడించారు.