09-01-2026 03:14:59 PM
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపట్నుంచి మూడు రోజుల పాటు గుజరాత్(Gujarat)లో పర్యటించనున్నారు. రేపు సోమనాథ్ ఆలయంలో ఓంకార మంత్రి జపంలో, ఎల్లుండి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ లో ప్రధాని పాల్గొనున్నారు. ఎల్లుండి వైబ్రంట్ గుజరాత్ సదస్సును మోదీ ప్రారంభిస్తారు. అహ్మదాబాద్ మెట్రో రెండో దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 12 అహ్మదాబాద్ లో జర్మన్ ఛాన్సలర్ తో నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ప్రధానిమోదీ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ సబర్మతి ఆశ్రయాన్ని సందర్శించనున్నారు. అనంతరం అహ్మదాబాద్ లో గాలిపటాల ఉత్సవానికి మోదీ, మెర్జ్ హాజరు కానున్నారని పీఎంవో వెల్లడించింది.