విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి పిలుపు
నిర్మల్, మార్చి 29 (విజయక్రాంతి): నేటి సమాజంలో పోటీ తీవ్రమవుతున్న తరుణం లో విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్లాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, మున్సిపల్ చైర్ పర్సన్ అప్ప ల కావ్య అన్నారు, ఆదివారం జిల్లా కేంద్రంలో వశిష్ట 25వ రజిత వేడుకలను ప్రారంభించారు. 2001లో నిర్మల్ జిల్లా కేంద్రంలో వశి ష్ట విద్యాసంస్థలు ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ ఎందరో మంది విద్యార్థుల కు బంగారు బాట చూపిందని గుర్తు చేశారు.
విద్యతోపాటు క్రమశిక్షణ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నాలెడ్జ్ అందించాలన్నారు. ప్రతి ఒక్క రు విద్యావంతులు అయినప్పుడే సమాజంలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ శోభా సత్యనారాయణ కూడా మాట్లాడుతూ వశిష్ట విద్యాసంస్థల ద్వారా విద్యాభ్యాసం పొందిన ఎందరో మంది పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉద్యోగ రంగాల్లో స్థిరంగా ఉన్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి విద్య సంస్థల డైరెక్టర్ సర్వోత్తమ్ రెడ్డి ప్రిన్సిపల్ అఖిలేష్ యాదవ్ మహేష్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు




