01-01-2026 12:30:49 AM
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్
మణుగూరు, డిసెంబర్ 31,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠ శాలలో పదవ తరగతి చదివే విద్యార్థినీ విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉత్తమ గ్రే డ్లు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రుల కు మంచి పేరు తీసుకొని రావాలని ఐటి డిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ విద్యా ర్థులకు సూచించారు. బుధవారం ఆయ న పలు పాఠశాలలో విస్తృతంగా పర్య టించి, తాహసిల్దార్ కార్యాలయాన్ని సం దర్శించారు. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలికల పాఠశాలను సంద ర్శించి, ప్రైమరీ, పదో తరగతి విద్యార్థి నిలతో ప్రత్యేకంగా తరగతి గదిలో ఉద్దీ పకం వర్క్ బుక్ లోని అం శాల గురించి ప్రైమరీ విద్యార్థినిలతో బోర్డుపై వ్రాయించి వారికి పలు సూచనలు చేశారు.
అనం తరం మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు మీ జీవితానికి ఎంతో ము ఖ్య మైనవని, అందుకు విద్యార్థినిలు ఉ పా ధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్దగా విని అర్థం చేసుకొని మరల మన నం చేసుకుంటూ కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, మీ చదువు తోపాటు భవిష్యత్తులో మీరు ఏమి కావా లని మనసులో ఒక గోల్ ఎంచుకుని కెరీర్ గైడెన్స్ సంబంధించిన అంశాలపై దృష్టి సారించలన్నారు. ఇప్ప టినుండే ప్రిపేర్ కావాలని అన్నారు. సబ్జెక్ట్ టీచర్లు విద్యా ర్థినిలు ఏ సబ్జెక్టులు అయితే వెనుకబడి ఉన్నారో వారిపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు పీరియడ్లు తీసుకొని పరీక్షలు నాటికి వారు పూర్తిస్థాయిలో ప్రతి సబ్జె క్టుపై భయం లేకుండా పరీక్షలు రాసేలా చూడాలన్నారు.
పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసి మార్చి 31 నాటికి పూర్తిగా అద నపు తరగతి గదుల ని ర్మాణం పూర్తి అ య్యే లా చూడాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్ కు ఫోన్ ద్వారా ఆదేశించారు.అనంతరం తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ లిస్ట్ కు సంబం ధించిన అంశాలను పరిశీలించి ఓటర్ లిస్టులో ఫ్యామిలీ మెంబర్స్ మ్యాడింగ్ మరి యు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి కుటుం బంలోని సభ్యుల అందరి పేర్లు సక్రమంగా నమోదు చేయాలని తాసిల్దార్ కు ఆదే శించారు. కార్యక్రమంలో పాఠశాల హె చ్ ఎం మహాలక్ష్మి, తాహసిల్దార్ అద్దంకి నరే ష్, కార్యాలయం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.