01-01-2026 12:28:56 AM
అశ్వారావుపేట, డిసెంబరు 31 (విజయక్రాంతి): మండలంలోని నారాయణపురం కాలనీలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు బుదవారం దాడులు నిర్వహించారు. గ్రామంలో ఓప్రదేశంలో పేకాట అడు తున్నారనే సమాచారంతో ఎస్‌ఐ యయాతిరాజు తన సిబ్బందితో దాడులు నిర్వహిం చారు. దాడులో రూ.15,650 నగదును, ఐ దు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ యయాతిరాజు తెలిపారు.
మరొకరు పరారీలో ఉన్నారు. ఈసం దర్భంగా ఎస్‌ఐ యయాతిరాజు మాట్లాడుతూ కొత్త సంవత్సరం, సంక్రాంతి అంటూ ఎవరైనా పేకాట. కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పల్లెలో ప్రత్యక్ష నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాలో ఎటువంటి జూదం. కోడిపందాలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ రాజు కోరారు.