రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభను చాటారు. శని ఆదివారాల్లో భూపాల్ పల్లి జిల్లాలో నిర్వహించిన ఈ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ పాఠశాలకు చెందిన కొట్టేసాయి శ్రీ వాత్సవ్ కు బ్లాక్ స్ట్రోక్ 200 మీటర్లు, బ్రెస్ట్ స్ట్రోక్ 2 మీటర్లు విభాగంలో రెండు కాంస్య పథకాలు, బండారి నాగ చైతన్య బట్టర్నే 200 మీటర్ల విభాగంలో ఒక కాంస్య పథకం కైవసం చేసుకున్నారు. కొత్తగూడెంలోని సెంట్ జోసెఫ్ పాఠశాలకు చెందిన చత్రపతి నాథ్ బట్టర్నె విభాగంలో 200 మీటర్ల పోటీలో రజత పతకం సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను నవభారత్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎంబిఎస్ రెడ్డి, సెంట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి, సి ఈ ఆర్ క్లబ్ స్విమ్మింగ్ ఫూల్ కోచులు హనుమంత, రాజేష్, శామ్యూల్, సంధ్య, రాంబాబు, సామంతులు అభినందించారు.






