20 April, 2026 | 7:35 AM

కుక్కల దాడిలో 8 గొర్రె పిల్లలు మృతి

08-12-2024 11:57 PM

చింతలపాలెం: వీధి కుక్కలు దాడి చేయడంతో 8 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దొంగల సైదులు గొర్రెలను పెంచుతున్నాడు. ఆదివారం గొర్రెలను మేతకు తీసుకువెళ్తూ గొర్రె పిల్లలను కొట్టంలోనే ఉంచి వెళ్ళాడు. ఆదివారం మధ్యాహ్నం కొట్టంలోకి దూరిన కుక్కలు మూగజీవాలపై తీవ్రంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో 8 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరికొన్నిటికి తీవ్ర గాయాలయ్యాయి. జీవాల మృతితో 50 వేలకు పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కొన్ని రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్టు కాలనీలో కూడా కుక్కల దాడిలో 20 పైగా జీవాలు మృతి చెందాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కుక్కల బెడద నివారించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.