01-01-2026 02:04:51 AM
నంగునూరు, డిసెంబర్ 31: మండల పరిధిలోని అక్కెనపల్లి ఆదర్శ పాఠశాలలో బు ధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వి ద్యార్థులు ఉత్సాహంగా వివిధ పాత్రల్లో ఒదిగిపోయారు. విద్యాశాఖ మంత్రి నుంచి ప్ర ధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల వరకు బాధ్యతలు స్వీకరించి పాఠశాల నిర్వహణను చక్కగా నిర్వహించారు.క్రమశిక్షణను పర్యవేక్షిస్తూ తమలోని నాయకత్వ ప్రతిభను చా టారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మం ద జానయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకే, లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తన,ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించేం దుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయ న తెలిపారు.అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ. శ్రీనివాస్,వి. నర్సయ్య, కె. సుధాకర్, ఎం. పరశు రాములు,స్వాతి,భానురేఖ తదితరులు పాల్గొన్నారు.