01-01-2026 02:05:25 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 31 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో రెండు రోజుల క్రితం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ నాయక్ ఓ సమావేశంలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బజరంగ్‌దళ్ నేతలు భగ్గుమన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల యూత్ అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సంతోష్‌నాయక్ దురుసుగా తన నోటికి వచ్చినట్టు జైశ్రీరామ్ అనొద్దు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఎల్లారెడ్డి జైశ్రీరామ్ యువసేన, బజరంగ్‌దళ్ నాయకులు మండిపడ్డారు. దురుసుగా మాట్లాడినందుకు బేషరత్‌గా క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో కఠిన చర్యలుంటాయని సంతోష్‌నాయక్‌ను ఆయా సంఘాల నేతలు హెచ్చరించారు.
దీంతో సంతోష్‌నాయక్ బుధవారం తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరారు. ఆయన్ని ఎల్లారెడ్డిలోని రామాలయం ముందు తీసుకొచ్చి రామునికి సాష్టాంగ నమస్కారం చేయించి జైశ్రీరామ్ అనిపించారు కార్యక్రమంలో ఎల్లారెడ్డి బజరంగ్‌దళ్ సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.