28-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 27(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. అండర్ 8, 10 ,12 విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు జిల్లా నుండి 50 మం ది క్రీడాకారులు హాజరయ్యారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సట్ల శంకర్ తెలిపా రు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారని వీరు జూన్ 1న హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌం డ్స్ లో జరగనున్న 11 వ తెలంగాణ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అధికారి బండ మీనా రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి గుండం లక్ష్మణ్, కోచ్ విద్యాసాగర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.