calender_icon.png 18 May, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు

26-04-2025 12:00:00 AM

ఏసీపీ తీర్థాల సత్యనారాయణ 

వరంగల్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): చదువుకు పేదరికం అడ్డు కాదని, లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ఇందుకు 2025 సివిల్స్ టాపర్ ఇట్టబోయిన సాయి శివాని ఇందుకు నిదర్శనమని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి తీర్థాల సత్యనారాయణ అన్నారు.

2025 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన శివాని ఏసిపి సత్యనారాయణ అభినందించారు. శివాని ఉన్నతికి కష్టాలను ఎదుర్కొని అండగా నిలిచిన తల్లిదండ్రుల కృషి మరువలేనిదన్నారు. సాయి శివాని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.