calender_icon.png 21 January, 2026 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీల్ బ్రిడ్జిపై విన్యాసాలు

02-10-2024 02:10:43 AM

ముగ్గురి అరెస్ట్

ముషీరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): నగరంలోని నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జీపై బైక్‌లు నడుపుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ముగ్గురు బైకర్లను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ఇన్‌స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన ఎండీ జైనుల్లాబుద్దీన్, గజాన్‌ఫర్ అలీ, ఎస్కే మాటిన్ ఇటీవల స్టీల్ బ్రిడ్జిపై బైక్‌లు నడుపుతూ ప్రమాదకర విన్యాసాలు చేశారు.

దీంతో తోటి ప్రయాణికులు భీతిల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు యువకులను గాలించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.