26-08-2025 06:16:55 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ (పెద్దపులి గుర్తు) పై పోటీ చేస్తున్న విక్రమ్ రావు కు మద్దతుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బైక్ ర్యాలీ చేపట్టారు. దేవాపూర్ క్వార్టర్స్ నుండి సిమెంట్ కంపెనీ వరకు కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి విక్రమ్ రావుకు మద్దతుగా నినాదాలిస్తూ ర్యాలీ చేపట్టారు. కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడే అభ్యర్థి విక్రమ్ రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.