01-07-2025 04:33:38 PM
అధ్యక్షులు అల్లం దేవేందర్ రెడ్డి..
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల(Mutharam Mandal) సాయిరాం ఆటో ట్రాలీ యూనియన్ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. మంగళవారం మండల ఆటో ట్రాలీ యూనియన్ సభ్యులు మండల కేంద్రంలో ముత్తారం మండల ఆటో ట్రాలీ సాయిరాం యూనియన్ అధ్యక్షుడిగా అల్లం దేవేందర్ రెడ్డిని, ఉపాధ్యక్షులుగా రాగుల మొగిలిని, ప్రధాన కార్యదర్శిగా కోళ్ల శ్రీనివాస్, దురుశెట్టి కుమార్ ను కోశాధికారిగా మధురకవీ రఘు, నారాయణ స్వామిని, ప్రచార కార్యదర్శిగా గుడి సాగర్ ను కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ట్రాలీ యూనియన్ నాయకులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటో ట్రాలీ యూనియన్ సభ్యులకు తాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, యూనియన్ తోడ్పాటు కృషి చేస్తామని మా ఎన్నికకు సహకరించిన యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.