02-07-2025 12:35:46 AM
న్యూఢిల్లీ, జూలై 1: రుతపవన ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు రూ.50 కోట్ల విలు వైన పంచదార గంగపాలైంది. హర్యానాలోని యమునా నగర్‌లో ఉన్న సరస్వతి షు గర్ మిల్‌లోని వరద నీరు పోటెత్తింది. దీం తో ఎగుమతికి సిద్ధంగా ఉన్న పంచదార బస్తాలు నీళ్లలో తడిసిపోయాయి. ఆ వరద నీళ్ల లో పంచదార కరిగిపోయి కనిపించింది.
యమునా నగర్ గిడ్డంగిలో 2 లక్షల 20 వేల క్వింటాళ్ల పంచదార స్టోర్ చేసి ఉంది. ఈ పం చదార విలువ సుమారు రూ.97 కోట్లు ఉం దని అంచనా. వరదల కారణంగా సుమారు 40 శాతం పంచదార గంగపాలైందని, నష్టం రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వరద నీటితో పాటు సమీపంలోని డ్రైన్ పొంగి పొర్లడంతో నీళ్లు.. షుగర్ మిల్‌లోకి ఉప్పెనలా వచ్చి, పంచదార బస్తాలను ముంచెత్తాయని అధికారులు తెలిపారు.
సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా ఈ ఘటనపై స్పందిస్తూ.. మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ వాటర్ గిడ్డంగి కుడి వైపు నుంచి పోతుంటాయని, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయి ఆ నీళ్లన్నీ వరద నీటితో కలిసి షుగర్ మిల్‌ను గిడ్డంగిని ముంచెత్తాయని చెప్పారు. సోమవారం రాత్రి హర్యానాలో కుండపోత వర్షం కురిసింది. వరద నీళ్లు ముంచెత్తాయి.
ఎంత భారీ వర్షాలు కురిసినా, వరదలు పోటెత్తినా ఈ షుగర్ మిల్‌లోకి ఎప్పుడూ నీళ్లు పోలేదని, మొదటిసారిగా ఇలా జరిగిందని పేర్కొన్నాడు. గిడ్డంగిలో ఉన్న నీళ్లను అధికారులు భారీ మోటార్ల సాయంతో బయటకు తోడిపోయిస్తున్నారు. రూ.కో ట్లలో నష్టం సంభవించినప్పటికీ.. స్థానిక మార్కెట్లలో పంచదార లభ్యతపై ప్రభావం ఉండదని మిశ్రా వెల్లడించారు.